selfie: మొస‌లితో సెల్ఫీ ప్రయత్నం... మహిళ కాలుని కొరికేసిన మొసలి!

సెల్ఫీ మోజులో ఎంతో మంది ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్న ఘ‌ట‌న‌లు ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికీ, కొంద‌రు మాత్రం సెల్ఫీ పిచ్చిని వ‌దిలించుకోవ‌డం లేదు.  ప్ర‌మాద‌కర ప్ర‌దేశాల్లో, క్రూర మృగాల‌తో సెల్ఫీల‌కు ప్ర‌య‌త్నించి ఆసుప‌త్రుల పాల‌వుతున్నారు. ఇటువంటి ఘ‌ట‌నే థాయ్‌లాండ్‌ లోని ఖయో యాయ్‌ జాతీయ పార్కులో మ‌రొక‌టి చోటుచేసుకుంది. మొస‌లితో సెల్పీ తీసుకుంటూ మారియల్‌ బెనెటులియర్‌(41) అనే ఫ్రెంచ్‌ మహిళ గాయాల‌పాల‌యింది. ఆమె కాలిని మొసలి కొరికేసింది. స‌ద‌రు మ‌హిళ‌ మొసలికి బాగా దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్ర‌య‌త్నం చేసింద‌ని, దీంతో అది పట్టుకుని కోరకడంతో ఆమె ఎడమ కాలికి గాయాలయ్యాయని పార్కు సిబ్బంది చెప్పారు. పార్కులో సూచించిన హెచ్చ‌రిక‌ల బోర్డుల‌ను ప‌ట్టించుకోకుండా ఆమె ఈ దుస్సాహ‌సం చేసింద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఆమె ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని ఆసుప‌త్రి డాక్టర్లు చెప్పారు.

More Telugu News