demonitisation: నగదురహిత లావాదేవీలకు ప్రోత్సాహం.. ఐసీఐసీఐ బ్యాంకు కొత్త మొబైల్ యాప్ లాంచ్

న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించే దిశ‌గా ఐసీఐసీఐ బ్యాంకు ఒక కొత్త మొబైల్ యాప్‌ను ఈ రోజు విడుద‌ల చేసింది. వ్యాపారుల కోసం 'ఈజీ పే'  పేరుతో మొబైల్ యాప్‌ను తీసుకొచ్చామ‌ని ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు తెలిపారు. వ్యాపారులు ఈ యాప్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల నుంచి ఎంత మొత్తమైనా స్వీకరించవచ్చని పేర్కొన్నారు.

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారంగా ఈ యాప్ ప‌నిచేస్తుంద‌ని, వ్యాపారుల వ‌ద్ద‌కు వెళ్లే క‌స్ట‌మ‌ర్లు క్రెడిట్, డెబిట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఐసీసీఐ డిజిటల్ వాలెట్  పాకెట్ ల‌ నుంచి ట్రాన్సాక్ష‌న్స్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. త‌మ బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఉన్న‌ ఖాతాదారులతో పాటు ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా ఈ యాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని చెప్పారు.

ఈ యాప్ ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్ ఫోన్లపై అందుబాటులోకి వ‌చ్చింద‌ని, కొన్ని రోజుల్లోనే ఐఓఎస్ ఫోన్ల వినియోగ‌దారుల‌కు కూడా అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్పారు. ఇటువంటి స‌ర్వీసు దేశంలోనే మొట్టమొదటి సర్వీస్ అని ఐసీఐసీఐ బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఒక వ్యాపారికి సంబంధించి 30 మంది వినియోగ‌దారులు ఏక‌కాలంలో ట్రాన్సాక్ష‌న్స్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.


More Telugu News