engineering students arrested: ఫోన్ కొంటామని చెప్పారు.. లాక్కొని పారిపోయారు.. ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్ట్!

ఆన్‌లైన్‌లో ఓ వ్య‌క్తి అమ్మ‌కానికి పెట్టిన ఫోన్‌ను కొంటామ‌ని చెప్పిన ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ విద్యార్థులు అత‌డి వ‌ద్ద నుంచి ఆ ఫోన్‌ను లాక్కొని పోయిన ఘ‌ట‌న చెన్న‌య్‌లో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో ఫోన్ అమ్మ‌డానికి వ‌చ్చిన ఆ వ్య‌క్తి షాక్ తిన్నాడు. అనంత‌రం తేరుకొని పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డంతో ఎట్ట‌కేల‌కు నిందితుల‌ని పోలీసులు అరెస్టు చేశారు. వివ‌రాలు చూస్తే..రంజిత్‌ కుమార్‌ అనే వ్యక్తి త‌న వ‌ద్ద ఉన్న శాంసంగ్‌ ఎస్‌7 ఎడ్జ్‌ ఫోన్‌ను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో రూ.40 వేల‌కు అమ్మకానికి పెట్టాడు.

మనోజ్ , మోతిస్వరణ్‌ అనే ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆన్‌లైన్ లో ఫోన్ కోసం సెర్చ్ చేసి రంజిత్ కుమార్ ఆన్‌లైన్‌లో ఉంచిన ఫోన్‌ను చూశారు. దాన్నికొంటామని చెప్పి ఫోన్ చేశారు. రంజిత్‌ను మాధవరం అనే ప్రాంతంలోని ఓ పార్క్‌ వద్దకు రమ్మని చెప్పారు. రంజిత్‌ అక్కడికి రాగానే, అత‌డి ద‌గ్గ‌ర‌కు వెళ్లిన స‌ద‌రు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆఫోన్ వివ‌రాలు అడుగుతున్నట్లుగా మాట్లాడి ఒక్క‌సారిగా ఫోన్‌ లాక్కొని బైక్ పై పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో బాధితుడు పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ద‌ర్యాప్తు జ‌రిపి నిందితుల‌ని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News