bsnl: ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో ఫోను బిల్లులు చెల్లించండి.. డిస్కౌంట్ పొందండి... బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్ర‌మంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ఓ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. తమ కస్టమర్లు ఫోను బిల్లులను ఆన్‌లైన్‌లోగానీ, ఎలక్ట్రానిక్ పద్ధతిలో గానీ చెల్లిస్తే ఆ బిల్లులో 0.75% డిస్కౌంట్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా పేరిట ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. న‌గ‌దుర‌హిత లావాదేవీల వైపు భార‌తావ‌ని ప్ర‌యాణించాల‌ని కేంద్ర‌ ప్ర‌భుత్వం చేస్తోన్న ప్ర‌య‌త్నాలకు త‌మ క‌స్ట‌మ‌ర్లు తోడ్పాటునందించాల‌ని బీఎస్ఎన్ఎల్ కోరింది. ఆన్‌లైన్ ప‌ద్ధ‌తితో బిల్లులు చెల్లిస్తే సర్వీస్ చార్జీ మినహా బిల్లు మొత్తానికి ఈ రాయితీ వర్తిస్తుందనని ఆ కంపెనీ తెలిపింది. ఈ రాయితీ ఈ రోజు నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాల‌వ్య‌వ‌ధిలో పోస్ట్ పెయిడ్ వినియోగ‌దారులు స‌హా జీఎస్‌ఎం ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌ రీచార్జి బిల్లులకు వర్తిస్తుందని పేర్కొంది.

More Telugu News