: డబ్బెంతో చెప్పండి... ఎక్కడిదో అడగబోము: కేంద్రం మరిన్ని సౌలభ్యాలు

సాధ్యమైనంత ఎక్కువ మేర నల్లధనాన్ని తిరిగి వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా, ఇప్పటికే పలు స్కీములు అమలు చేసిన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తాజాగా, గరీబ్ కల్యాణ్ యోజనను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. గత వారంలో ఈ స్కీమ్ ను ప్రకటించినా, ఆశించిన రీతిలో బ్యాంకులకు డిపాజిట్లు రాకపోవడం, నల్లధనాన్ని బయటకు చెప్పేవారి సంఖ్య సంతృప్తికరంగా లేకపోవడంతో, ఈ స్కీము నిబంధనలను మరింత సరళీకృతం చేస్తూ, కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కీమును వినియోగించుకునే వారు, తమ వద్ద ఉన్న డబ్బెంతో చెప్పి, దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే చాలని, ఆ డబ్బు ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందన్న విషయాన్ని అడగబోమని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, ఈ డబ్బు డిపాజిట్లలో 50 శాతం జరిమానాగా కేంద్ర ఖజానాకు చేరుతుందన్న సంగతి తెలిసిందే.

More Telugu News