: ఇంటర్నెట్ లో విహరించే విద్యార్థులకు తెలివితేటలున్నా, తక్కువ మార్కులే వస్తాయట!

అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో, ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అత్యంత తెలివితేటలు ఉన్నప్పటికీ, బ్రౌజింగ్ చేసే విద్యార్థులకు పరీక్షల్లో తక్కువ మార్కులే వస్తాయట. అధ్యయనంలో వెల్లడైన విషయాలను 'సైకలాజికల్ సైన్స్' జర్నల్ ప్రచురించింది.

ల్యాప్ టాప్ ల ద్వారా ప్రతి రోజు సగటున 37 నిమిషాల పాటు విద్యార్థులు బ్రౌజింగ్ చేస్తున్నారట. ఎక్కువ సమయం సోషల్ మీడియా, ఈమెయిల్ చెక్ చేసుకోవడం, ఆన్ లైన్ షాపింగ్, వీడియోలు చూడటం చేస్తున్నారట. ఇవన్నీ వారి చదువుపై ప్రభావం చూపుతున్నాయని అధ్యయనం తేల్చింది. ఈ ఇంటర్నెట్ బ్రౌజింగ్ వారి మార్కులను పెంచేందుకు దోహదం చేయడం లేదని తెలిపింది. 

More Telugu News