పపువా న్యూ గునియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

17-12-2016 Sat 17:39
పపువా న్యూ గునియా తీర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో ఈ రోజు భారీ భూకంపం సంభ‌వించిన‌ట్లు పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. పపువాలోని టరోన్‌కు తూర్పున 46 కిలో మీటర్ల దూరంలో, 103 కిలో మీటర్ల లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. ఈ భారీ భూకంపం ప్ర‌భావంతో పపువా న్యూ గునియా సమీప ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీనికి సంబంధించి మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.