gunturodu teaser: మంచు మనోజ్ 'గుంటూరోడు' టీజర్ విడుదల

మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా రూపొందిన 'గుంటూరోడు' సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాకు 'లవ్ లో పడ్డాడు' అనే ఉపశీర్షిక పెట్టారు. ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో సాయి తలసాని, అనిల్ సుంకర, దర్శకుడు బాబీ టీజర్ ను విడుదల చేశారని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. కాగా, ఈ టీజర్ లో 'వీడికి నిజంగానే చెయ్యి దురదండీ బాబు...' అని ఒక వ్యక్తి అంటే... 'కొడితే ఒంట్లోని 206 ఎముకలు ఒకేసారి విరిగిపోతాయ్' అని మనోజ్ అనడాన్ని చూపించారు. కాగా, ఈ సినిమాకు ఎస్కే సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వసంత్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. 

More Telugu News