nokia 2107: చవకగా స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైన నోకియా

వ‌చ్చే ఏడాది ఆరంభంలో త‌మ వినియోగ‌దారుల ముందుకు మ‌ళ్లీ స్మార్ట్‌ఫోన్‌ల‌ను తీసుకువ‌స్తున్న‌ట్లు ఇప్ప‌టికే తెలిపిన నోకియా అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.  ఓ సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను త‌మ క‌స్ట‌మ‌ర్ల ముందు ఉంచ‌నుంది. మార్కెట్లో ఉన్న ఇతర కంపెనీల స్మార్ట్‌ ఫోన్లకు  ఏ మాత్రం తీసిపోని ఫీచ‌ర్ల‌తో నోకియా డీ1సీ మోడల్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్లు లీకయ్యాయి. నోకియా 2జీబీ ర్యామ్ కలిగిన‌ స్మార్ట్‌ఫోన్‌ను 10 వేలకు (13 ఎంపీ కెమెరాతో), , 3 జీబీ ర్యామ్ కలిగిన ఫోన్లను 13 వేలకు  (16ఎంపీ కెమెరాతో) మార్కెట్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.   డీ1సీ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రెనో 505 జీపీయూ అండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచ‌ర్ల‌తో మార్కెట్లోకి రానున్నాయి.

More Telugu News