: 8,150 వద్ద మద్దతు లేక మరింత పాతాళానికి నిఫ్టీ!

నోట్ల రద్దు తరువాత నెలకొన్న స్తబ్ధత, వృద్ధి రేటు తగ్గనుందని వస్తున్న ఊహాగానాలు, బులియన్ మార్కెట్ పతనం, ఆసియా మార్కెట్ల నుంచి అందుతున్న ప్రతికూల సంకేతాలు, మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయగా, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే, 120 పాయింట్ల దిగువన ఉన్న సెన్సెక్స్, ఆపై నష్టాన్ని పెంచుకుంటూ వెళ్లింది. మరే దశలోనూ కోలుకోలేదు. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక అత్యంత కీలకమైన 8,150 పాయింట్ల వద్ద కొనుగోలు మద్దతును ఆకర్షించడంలో విఫలమైంది. మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో 82.35 పాయింట్లు పడిపోయి 8,110 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ-50లో 11 కంపెనీల ఈక్విటీలు మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. బీపీసీఎల్, కోటక్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, అరవిందో ఫార్మా వంటి కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.

More Telugu News