: ఐఫోన్ 6 ప్లస్ మోడల్లో డిస్ ప్లే సమస్య నిజమే!: ఒప్పుకున్న యాపిల్

తమ ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లలో సమస్య ఉన్న మాట వాస్తవమే అని యాపిల్ సంస్థ ఒప్పుకుంది. ఒక్కోసారి డిస్ ప్లే సరిగా పనిచేయడం లేదని అంగీకరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్పెషల్ రిపేర్ ప్రోగ్రాంను లాంచ్ చేస్తున్నామని వెల్లడించింది. అయితే, ఈ సర్వీసు ఉచితం కాదండోయ్. రూ. 9,900 చెల్లించి, టచ్ డిసీజ్ ఉన్న ఫోన్లను రిపేర్ చేయించుకోవాలి. ఈ విషయాన్ని కూడా యాపిలే తెలిపింది. దీనికి కూడా కొన్ని కండిషన్లు పెట్టింది. ఫోన్ వర్కింగ్ కండిషన్లో ఉండాలి, డిస్ ప్లే పగిలి ఉండరాదు... ఇలాగైతేనే ఈ సర్వీస్ కు ఎలిజిబుల్ అన్నమాట. అంతేకాదు, ఈ సర్వీస్ కేవలం ఐఫోన్ 6 ప్లస్ మోడల్ కు మాత్రమే వర్తిస్తుంది. ఫోన్లపై ఒత్తిడి పడినప్పుడు, ఇతర కొన్ని సందర్భాల్లో ఈ డిస్ ప్లే సమస్య వస్తున్నట్టు యాపిల్ తెలిపింది.

More Telugu News