: పాత నోట్ల మార్పిడిపై అయోమయమా? అనుమానాలు నివృత్తి చేసే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఇవిగో!

రద్దు చేయబడిన వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను నేటి ఉదయం నుంచీ బ్యాంకులు మార్పిడి చేస్తున్నప్పటికీ, ప్రజల్లో ఎన్నో అనుమానాలు, అయోమయం నెలకొంది. గత రెండు రోజుల నుంచి ఎంతో ఆందోళనగా ఉన్న ప్రజలు ఈ ఉదయం బ్యాంకులు తెరవకుండానే పెద్ద ఎత్తున క్యూలు కట్టిన దృశ్యాలు దేశవ్యాప్తంగా కనిపించాయి. బ్యాంకులు పోస్టాఫీసు ఖాతాల్లో ఎంత డబ్బయినా డిసెంబర్ 30 వరకూ జమ చేసుకోవచ్చని ఎంత ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు. తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందుకు వచ్చి, కేవలం రూ. 4 వేలను మాత్రమే మార్చుకుని ఉసూరుమని వెనక్కు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న అనుమానాలు, అయోమయాన్ని తీర్చేందుకు ఆర్బీఐ ఓ ఈ-మెయిల్, ఫోన్ నంబర్లను ప్రకటించింది. నోట్ల రద్దు, మార్పిడిపై ఎటువంటి సందేహాలు ఉన్నా తీర్చుకోవచ్చని తెలిపింది. ఈ-మెయిల్: currencyquerynd@rbi.org.in ఫోన్: 011- 23452126

More Telugu News