: 15 నిమిషాల్లో రూ. 7 లక్షల కోట్లు హారతి!

మార్కెట్ బుల్ అడ్డంగా పడిపోయింది. యూఎస్ కు తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వస్తారని ఖాయమైన వేళ, భారత స్టాక్ మార్కెట్లో 15 నిమిషాల వ్యవధిలో రూ. 7 లక్షల కోట్లు హారతి కర్పూరమైంది. బ్రెగ్జిట్ ను మించిన విధంగా మదుపర్లు తీవ్ర భయాందోళనలకు గురికాగా, అన్ని కంపెనీలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లీమన్ బ్రదర్స్ దివాలా నాడు నమోదైన 'వెడ్నెస్ డే బ్లడ్ బాత్'ను మించిన విధంగా నష్టం నేడు నమోదైంది. సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు పతనాన్ని కళ్లజూశాయి. ఆపై కాస్తంత తేరుకున్న భారత స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం సెన్సెక్స్ 947, నిఫ్టీ 300కు పైగా పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా, ఇన్వెస్టర్ల సంపద క్రితం ముగింపుతో పోలిస్తే, 4.5 లక్షల కోట్లు తగ్గింది.

More Telugu News