: మార్కెట్లపై అమెరికా ఎన్నికల ఎఫెక్ట్... సెన్సెక్స్ 349 పాయింట్ల పతనం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావంతో భారతీయ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్న తరుణంలో... హిల్లరీ, ట్రంప్ ల మధ్య పోటీ నానాటికీ నువ్వా? నేనా? అన్నట్టుగా కనిపిస్తోంది. ఇద్దరూ ఎవరికి వారు తమ తమ వ్యూహాలతో ప్రచారంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో, ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 349 పాయింట్లు పతనమై 27,527కు వద్దకు పడిపోయింది. నిఫ్టీ 112 పాయింట్లు కోల్పోయి 8,514కు చేరింది. ఈ నాటి టాప్ గెయినర్స్... ఎస్ఆర్ఈఐ ఇన్ ఫ్రా (6.96%), ఎస్కేఎఫ్ ఇండియా (5.56%), ఎంఎంటీసీ లిమిటెడ్ (4.72%), మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (3.54%), భారతి ఇన్ ఫ్రా టెల్ (3.21%). టాప్ లూజర్స్... కెనరా బ్యాంక్ (-5.60%), ఓరియంటల్ బ్యాంక్ (-5.44%), జీఎస్ఎఫ్సీ (-5.39%), హెచ్డీఐఎల్ (-4.94%), డెల్టా కార్ప్ లిమిటెడ్ (-4.87%).

More Telugu News