: ఆల్టోపై తగ్గిన మోజు... అక్టోబర్ లో పడిపోయిన అమ్మకాలు

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మోడల్ గా ఉన్న మారుతి సుజుకి ఆల్టోపై మోజు తగ్గుతోంది. గడచిన అక్టోబరులో ఆల్టో అమ్మకాలు 9.8 శాతం తగ్గాయి. గత సంవత్సరం పండగ సీజనులో 37,595 ఆల్టో యూనిట్లు విక్రయం కాగా, ఈ సంవత్సరం 33,929 యూనిట్లు అమ్ముడయ్యాయని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం మీద తమ కార్ల అమ్మకాలు 2.2 శాతం పెరిగాయని, ఎగుమతులు తగ్గాయని సంస్థ తెలిపింది. అక్టోబరులో 1,23,764 కార్ యూనిట్లను విక్రయించామని ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల కాలానికి 8.7 శాతం వృద్ధిని నమోదు చేశామని పేర్కొంది. సియాజ్, ఎర్తిగా, బ్రెజా, బాలెనో అమ్మకాలు పెరిగాయని సంస్థ మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఈడీ ఆర్ఎస్ కల్సీ వెల్లడించారు. సెడాన్ సెగ్మెంట్ లో తాము విక్రయిస్తున్న డిజైర్ కారు అమ్మకాలు 27.4 శాతం తగ్గి 2,481 యూనిట్లకు పరిమితం కాగా, సియాజ్ అమ్మకాలు 8 శాతం వృద్ధితో 6,360 యూనిట్లకు చేరాయని వివరించారు.

More Telugu News