: నష్టాలతో ముగిసిన మూరత్ ట్రేడింగ్

దీపావళి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎస్ఎస్ఈ) లు నిర్వహించిన మూరత్ ట్రేడింగ్ నష్టాలతో ముగిసింది. సంవత్ 2073 ను సూచీలు నష్టాలతో మొదలు పెట్టాయి. ఆరంభ ట్రేడింగ్ లో బీఎస్ఈ 154 పాయింట్లు లాభపడి 28 వేల మార్కును దాటింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 40.25 పాయింట్లు లాభపడి, 8,678.25 కు చేరింది. ఆ తర్వాత సూచీలు మెల్లగా దిగుతూ చివరకు నష్టాలతో మగిశాయి. బీఎస్ఈ 11.30 పాయింట్లు నష్టపోయి 27,930.21 వద్ద, నిఫ్టీ 8,650 పాయింట్లకు దిగువకు పడిపోయి 12.30 పాయింట్ల నష్టంతో 8625.70 వద్ద ముగిశాయి. కాగా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్ యూఎల్, లుపిన్, ఓఎన్జీసీ, షేర్లు లాభపడగా; ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్ సీ షేర్లు నష్టపోయాయి.

More Telugu News