: అతిచిన్న స్మార్ట్‌ఫోన్‌... ఫీచర్లు మాత్రం అదుర్స్!

స్మార్ట్‌ఫోన్లపై యువ‌త‌లో ఉన్న క్రేజు ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్ క‌నప‌డుతూనే ఉంది. వీడియోలు చూసుకోవ‌డానికి, ఇంట‌ర్నెట్‌ను ఉప‌యోగించ‌డానికి వీలుగా అంద‌రూ 4 అంగుళాల కంటే ఎక్కువ‌గా స్క్రీన్ ఉండే స్మార్ట్ ఫోన్ల‌నే ఉప‌యోగిస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా కేవ‌లం డిస్‌ప్లే సైజు 1.54 అంగుళాలు మాత్రమే ఉండేలా ప్రపంచంలోనే అతి చిన్న టచ్‌స్క్రీన్ ఫోన్‌ను త‌యారు చేసింది చైనాలోని వీఫోన్ కంపెనీ. ఇటీవ‌ల ఈ బుల్లిఫోన్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేశారు. దీన్ని ‘వీఫోన్‌ ఎస్‌8’ మోడ‌ల్‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. ప్రపంచంలోనే అతిచిన్న స్మార్ట్‌ఫోన్‌గా రూపుదిద్దుకున్న ఈ ఫోన్ పెద్ద స్మార్ట్‌ఫోన్లకు దీటుగానే ఫీచ‌ర్‌ల‌ను క‌లిగి ఉండ‌డం విశేషం. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ వేరియంట్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఓఎస్‌లను సపోర్ట్‌ చేసే చిన్ని ఫోన్లనూ మార్కెట్లోకి తెస్తామ‌ని వీఫోన్ తెలిపింది. ఈ ఫోన్‌ ధర 30 డాలర్లు(సుమారు రూ. 2000)గా ఉంది. పవర్‌ బటన్‌ మాత్రమే క‌లిగి ఉన్న ఈ ఫోను తెరపై మరో మూడు వర్చువల్‌ బటన్స్‌ ఉన్నాయి. బిల్ట్‌ఇన్‌ ఎఫ్‌ఎం రేడియో, హార్ట్‌ రేట్‌ సెన్సర్‌, నడకను లెక్కించే పెడోమీటర్‌, లైట్‌ సెన్సర్‌, 64ఎంబీ ర్యామ్‌, 128ఎంబీ ఇంటర్నల్‌ మెమొరీ, 380యంఏహెచ్‌ బ్యాటరీ ఇందులోని ఫీచ‌ర్లుగా ఉన్నాయి. చైనా మార్కెట్లో ఈ ఫోను ల‌భిస్తోంది.

More Telugu News