: సింగపూర్‌ లో డ్రైవర్ లెస్ కారుకి యాక్సిడెంట్

ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త టెక్నాలజీతో డ్రైవర్‌ లెస్‌ కార్లను చాలా కంపెనీలు తయారు చేసి పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింగపూర్‌ పబ్లిక్‌ రోడ్లపై ఈ డ్రైవర్ లెస్ కారును పరీక్షిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌ లెస్‌ కారు టెక్నాలజీని రూపొందిస్తున్న నుటోనోమీ అనే కంపెనీకి చెందిన ఈ కారును ఇద్దరు ఇంజనీర్లు ఆపరేట్‌ చేస్తుండగా రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును అది ఢీ కొట్టిందని సింగపూర్‌ రవాణా విభాగం వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ లెస్ కారు చాలా నెమ్మదిగా వెళ్తుండడంతో, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. టెస్ట్‌ రన్‌ లో ఉన్న కారు మరో లేన్‌ లోకి మారుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు లాండ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అథారిటీ ఫేస్‌ బుక్‌ పేజ్‌ లో పోస్ట్‌ చేసింది.

More Telugu News