: 15 శతాబ్దంలో గెలీలియో చెప్పింది... నాలుగు శతాబ్దాల తరువాత రుజువైంది!

15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త గెలీలియో చెప్పిన వాస్తవాన్ని నాలుగు శతాబ్దాల తరువాత శాస్త్రవేత్తలు ఇప్పుడు రుజువు చేశారు. వివరాల్లోకి వెళ్తే... గ్రహాలను, నక్షత్రాలను, పాలపుంతలను చూసేందుకు వినియోగించే టెలీస్కోప్‌ ను కనుగొన్న గెలీలియో, ఏవైనా రెండు వస్తువులను గాలిలేని ప్రదేశంలో ఎత్తునుంచి విడిచిపెడితే రెండూ ఒకేసారి భూమిపై పడతాయని ఆయన చెప్పారు. భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడైన గెలీలియో చెప్పిన విషయంపై చర్చోపచర్చలు నడిచాయి. అప్పట్లో గాలిని తీయడం తెలియక బరువైన, తేలికైన వస్తువులను గాల్లో విడువగా బరువైన వస్తువు నేలను ముందు తాకగా, తేలికైన వస్తువులు ఆలస్యంగా భూమిని చేరాయి. దీంతో, అప్పట్లో దానిని నిరూపించగలిగే పరిజ్ఞానం లేకపోవడంతో అది ఇన్నాళ్లూ మిస్టరీగానే మిగింది. తాజాగా బీబీసీ ఛానెల్ ఈ ప్రయోగాన్ని నిరూపించింది. ఒక పెద్ద ఛాంబర్ లో బాగా ఎత్తు నుంచి పక్షి వెంట్రుకలు (ఈకలు), బంతిని ఒకేసారి విడిచిపెట్టారు. బరువైన బంతి ముందుగా నేలను తాకగా, పక్షి వెంట్రుకలు ఆలస్యంగా నేలను తాకాయి. అదే ఛాంబర్ లో సాంకేతికపరిజ్ఞానం సాయంతో గాలిని తీసేసి ఈ పరీక్షను నిర్వహించారు. అదే ఛాంబర్ లో క్రేన్ సాయంతో బరువైన బంతి, పక్షి వెంట్రుకలను ఎత్తుకు తీసుకెళ్లి, చాంబర్ లో ఉన్న ఆక్షిజన్, ఇతర వాయువులను తీసేసి, ఆ రెండింటిని వదిలారు. ఆశ్చర్యంగా రెండూ ఒకేసారి నేలను తాకి, గెలీలియో చెప్పిన సూత్రాన్ని రుజువు చేశాయి. దీంతో 4 శతాబ్దాల తరువాత గెలీలియో చెప్పిన ప్రయోగం రుజువైంది. ఆ ప్రయోగం వీడియో మీకోసం..

More Telugu News