: నోట్ 7 ఫోన్ల ఉత్పత్తిని ఆపేసిన శాంసంగ్.. సమస్య పరిష్కారం కాకపోవడమే కారణం!

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7.. ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్ గురించి వచ్చినన్ని వార్తలు మరే ఇతర ఫోను గురించి రాలేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ ఫోన్లు పేలిపోతున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఫోన్లను వెనక్కి తీసుకున్న కంపెనీ కొత్త బ్యాటరీలతో వాటిని మార్చింది. అయినా ఫోన్లు పేలిపోతుండడంతో వాటి ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాలని సంస్థ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ‘యోన్‌హాప్’ అనే మీడియా సంస్థ పేర్కొంది. గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతున్నట్టు వస్తున్న వార్తలతో పలు విమానయాన సంస్థలు ఈ ఫోన్లను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఫోన్లను తిరిగి వెనక్కి తీసుకున్న శాంసంగ్ వాటిని కొత్త బ్యాటరీలతో రీప్లేస్ చేసింది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో వాటి ఉత్పత్తని నిలిపివేసింది. అయితే ఈ విషయంపై కంపెనీ ఇప్పటి వరకు అధికారంగా స్పందించలేదు. కాగా అమెరికా సహా పది దేశాల్లోని దాదాపు 25 లక్షల నోట్ 7 ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు గతనెల 2వ తేదీన శాంసంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

More Telugu News