: ఆర్బీఐ రేట్ కట్... హోం లోన్ ఈఎంఐపై ఎంత మిగులుతుందంటే..!

దసరా పండగ కానుకగా వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తూ, ఆరేళ్ల కనిష్ఠానికి రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకులు ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్)ను ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో రుణం తీసుకున్న వారికి ఆర్బీఐ సవరణలు వెంటనే వర్తిస్తాయి. వడ్డీ రేట్లు తగ్గిస్తే, వెంటనే లాభపడే వీరు, పెంచినప్పుడూ వెంటనే నష్టాన్ని భరించాల్సి వుంటుంది. ఇక అంతకుముందు బ్యాంకుల సొంత బేస్ రేటు ఆధారంగా రుణాలు తీసుకున్న వారు కావాలనుకుంటే ఎంసీఎల్ఆర్ రేటుకు మారిపోయే సదుపాయమూ వుంది. ఇక ఆర్బీఐ పావు శాతం రేట్ కట్ ప్రయోజనాలను బ్యాంకులు ఖాతాదారులకు అందిస్తే, 30 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలపరిమితికి 9.5 శాతం వడ్డీపై తీసుకున్న ఖాతాదారుకు నెలకు 488 మిగులుతుంది. ఈ ఖాతాదారు ప్రస్తుతం నెలకు కిస్తీగా రూ. 27,964 చెల్లిస్తుండగా, అది రూ. 27,476కు తగ్గనుంది. దీంతో సంవత్సరానికి రూ. 5,855 మిగులుతుంది. ఇక రూ. 50 లక్షల రుణం తీసుకుంటే నెలకు రూ. 818, సంవత్సరానికి రూ. 9,759 మిగులుతాయి. రూ. 75 లక్షల రుణం తీసుకుంటే నెలకు రూ. 1,220, సంవత్సరానికి రూ. 14,638 మిగులుతుంది.

More Telugu News