: బ్రిటన్ త్రయంకు ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి

జపాన్‌ శాస్త్రవేత్త యొషినొరి ఒషుమికి వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అందిస్తున్న‌ట్లు నిన్న నోబెల్‌ క‌మిటీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఫిజిక్స్‌లో నోబెల్ బ‌హుమ‌తికి ఎంపికైన వారి పేర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ ఏడాది ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం ద‌క్కింది. ఖగోళంలో రూపు మార్చుకుంటున్న పదార్థాలను అధ్యయనం చేసే ‘టోపాలజీ’ శాస్త్ర‌వేత్త‌ల‌యిన‌ బ్రిటన్ త్రయం డేవిడ్ థౌలెస్, డంకెన్ హాల్దేన్, మైఖేల్ కోస్టెర్‌లిడ్జ్‌లకు నోబెల్ ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు తెలిపింది. సాధారణ న్యూట్రాన్, ప్రొటాన్ కలయికతో కాకుండా సుదూర నక్షత్ర మండలాలనుంచి వెలువడుతున్న అసాధారణ పదార్ధాలపై అధ్య‌య‌నానికి ఈ ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు కృషి చేస్తున్నారు. త‌మ ప‌రిశోధ‌న‌ల ద్వారా సరికొత్త పదార్థాల ఆవిష్కరణలకు తోడ్పడుతున్నందుకు ముగ్గురికీ నోబెల్ ప్ర‌దానం చేస్తున్నామ‌ని క‌మిటీ చెప్పింది. రేపు రసాయన శాస్త్రంలో నోబెల్ పొందిన శాస్త్రవేత్తల పేర్లను కమిటీ ప్రకటించనుంది.

More Telugu News