: ఐఫోన్ 7 ఇండియాకే రాలేదు... 8పై హల్ చల్ చేస్తున్న స్పెసిఫికేషన్స్!

తాజా యాపిల్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 7 వర్షన్ అమ్మకాలు ఇంకా ఇండియాలో ప్రారంభమే కాలేదు, అప్పుడే వచ్చే సంవత్సరం మార్కెట్లోకి వచ్చే ఐఫోన్ 8వ తరం స్మార్ట్ ఫోన్ పై ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. తొలి ఐఫోన్ 2007 జూన్ 29న రాగా, సరిగ్గా పదేళ్లకు అంటే వచ్చే సంవత్సరం జూన్ 29న దీన్ని విడుదల చేయాలని యాపిల్ భావిస్తోందట. ఇక ఇప్పటివరకూ వచ్చిన అన్ని ఐఫోన్ మోడళ్లతో సంబంధం లేకుండా తయారయ్యే ఈ ఫోన్ లో ఎల్సీడీ స్క్రీన్ బదులు ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుందని సమాచారం. యూఎస్ పత్రిక 'బ్లూమ్ బర్గ్' ప్రచురించిన కథనం ప్రకారం, మరింత స్పష్టంగా కనిపించేలా ఓఎల్ఈడీ డిస్ ప్లే తెరలను 'షార్ప్' తయారు చేస్తోంది. మొత్తం రూ. 3,800 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ తో ఈ ప్యానళ్ల తయారీ ఇప్పటికే మొదలైంది. ఈ వేరియంట్ లో హోమ్ బటన్ ఉండదట. దీని స్థానంలో తమకు మాత్రమే పేటెంట్ హక్కులున్న వర్చ్యువల్ బటన్ ను వాడాలని యాపిల్ భావిస్తోంది. దీని వల్ల స్క్రీన్ సైజ్ ను పెంచి ఫోన్ ను మరింత ఆకర్షణీయం చేయవచ్చని యాపిల్ భావిస్తున్నట్టు పత్రిక పేర్కొంది.

More Telugu News