: వైద్యశాస్త్రంలో జపాన్‌ శాస్త్రవేత్తకు నోబెల్‌

జపాన్‌ శాస్త్రవేత్త యొషినొరి ఒషుమికి 2016 సంవత్స‌రానికిగానూ వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అందిస్తున్న‌ట్లు ఆ క‌మిటీ ఈరోజు ప్ర‌క‌టించింది. యొషినొరి ఆరోగ్యానికి సంబంధించి ఆటోఫేజీ అనే విధానంలో చేసిన కృషికిగానూ ఆయ‌న‌కు నోబెల్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్-2016 సాధించిన శాస్త్ర‌వేత్త పేరును రేపు ప్ర‌క‌టించ‌నుంది. ఆ త‌రువాత ఈనెల 5వ తేదీన ర‌సాయ‌న‌శాస్త్రం, 7వ తేదీన శాంతి, 10న ఆర్థిక శాస్త్ర విభాగాల్లో నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించ‌నున్నారు. ఆ త‌రువాత సాహిత్యంలో నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టించ‌నున్నారు. మొత్తం ఆరు విభాగాల్లో నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌టిస్తార‌న్న విష‌యం తెలిసిందే.

More Telugu News