: ఇది వైద్యశాస్త్రం సృష్టించిన అద్భుతం.. ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో పుట్టిన శిశువు

ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో ఉన్న పిండాన్ని అభివృద్ధి చేశారు. వైద్యశాస్త్ర అద్భుతమని చెబుతున్న ఈ సంఘటన మెక్సికోలో జరిగింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, తల్లి, తండ్రితో పాటు మరో దాతకు చెందిన డీఎన్ఏ ను ఎక్కించి ఆ పిండాన్ని అభివృద్ధి చేసి, కొత్త టెక్నిక్ ద్వారా మగ శిశువుకు ప్రాణం పోశామని చెప్పారు. అయితే, ముగ్గురు వ్యక్తుల డీఎన్ ఏలతో పిల్లలకు జన్మనివ్వడం ఇదే తొలిసారి కాదని, కాకపోతే ఈసారి వినియోగించిన టెక్నిక్ మాత్రం నూతనమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మైటోకాండ్రియా డొనేషన్ అనే పద్ధతితో సాగే ఈ టెక్నిక్ ను ఉపయోగించి శిశువుకు జన్మనివ్వడం జరిగిందన్నారు. శిశువు తల్లి జోర్డాన్ దేశస్థురాలని, పుట్టిన మగశిశువు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. తల్లికి ఉన్న జన్యు లోపాలు ఆ శిశువులో ఉండవని వైద్యులు చెప్పారు. జన్యు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలకు ఈ కొత్త టెక్నిక్ ఎంతో ఉపయోగకరమని చెప్పారు.

More Telugu News