: డేటా ఖర్చు లేకుండా అన్ లిమిటెడ్ సినిమాలు ఆఫర్ చేస్తున్న ఐడియా!

స్మార్ట్ ఫోన్ నుంచి ఓ సినిమాను డౌన్ లోడ్ చేసుకోవాలంటే దానికి ఎంతో డేటా ఖర్చవుతుందన్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో ఉచిత డేటా ఆఫర్ అమలవుతున్న వేళ, ఐడియా సెల్యులార్ సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. తామందిస్తున్న ఐడియా సెల్యులార్ మూవీ క్లబ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఏ మాత్రం డేటా ఖర్చు కాకుండా కావాల్సినన్ని సినిమాలను నచ్చిన క్వాలిటీలో డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ సౌకర్యం ఐడియా వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ యాప్ తో ఒకేసారి రెండు వీడియోలను కూడా చూడవచ్చని ఐడియా పేర్కొంది. కాగా, ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత కొంత చార్జీలను విధించవచ్చని తెలుస్తోంది.

More Telugu News