: ఢిల్లీలో చదువుకోవాలన్న పాకిస్థాన్ బాలిక కలను నెరవేర్చిన కేజ్రీవాల్ సర్కారు!

భార‌త దేశ రాజ‌ధాని ఢిల్లీలో త‌న చ‌దువుని కొన‌సాగించాల‌ని వ‌చ్చిన పాకిస్థాన్ బాలిక కల నెరవేరుతోంది. మధు అనే పదహారేళ్ల పాక్ అమ్మాయి ఢిల్లీకి వ‌చ్చింది. అయితే, రెండేళ్లుగా ఆమె ఏ పాఠ‌శాల‌లోనూ ప్ర‌వేశం పొంద‌లేక‌పోయింది. స‌మాచారం తెలుసుకున్న‌ ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం స్పందించడంతో ఆమెకు ప్ర‌వేశం ల‌భించింది. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రాంతంలో కొనసాగుతున్న‌ మతపరమైన హింసను త‌ట్టుకోలేని మ‌ధు కుటుంబం ఢిల్లీకి వ‌చ్చింది. అయితే, ఈ క్రమంలో త‌న‌ స్కూలుకు సంబంధించిన సర్టిఫికెట్ల‌ను విద్యార్థిని పోగొట్టుకుంది. దీంతో అడ్మిషన్ దొరక్క బాధపడుతున్న ఆమె ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ను కలిసి తన సమస్యను చెప్పింది. కేజ్రీవాల్ ఆదేశంపై వెంటనే స్పందించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఢిల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఆ అమ్మాయి గురించి తెలిపి, ఆమెకు విద్యాల‌యంలో ప్ర‌వేశం క‌ల్పించాల్సిందిగా ఆదేశించారు. దీంతో మ‌ధుకి త‌న చ‌దువుని కొన‌సాగించే అవ‌కాశం వచ్చింది. దీనిపై స్పందించిన‌ సిసోడియాకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ధ‌న్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

More Telugu News