: టీడీపీతో మేం కలిశామా?.. అవాస్త‌వాలు ప‌లుకుతున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి

టీఆర్ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తూ తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసింద‌ని ప్ర‌చారం చేయ‌డం భావ్యం కాద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం మల్లన్నసాగర్ నిర్వాసితుల ప‌ట్ల అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తోందని, ఈ విష‌యంపైనే ప్రతిపక్షాలన్నీ క‌లిసి రైతుల‌కు సంఘీభావం తెలిపాయని అన్నారు. ఈ విష‌యాన్ని సాకుగా చూపి తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ కుమ్మక్కయిందంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం భావ్యం కాద‌ని ఆయ‌న చెప్పారు. ఓటుకు నోటు కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని జీవ‌న్‌రెడ్డి ఈ సంద‌ర్భంగా ఆరోపించారు. పట్టిసీమను, పోలవరాన్ని కేసీఆరే సమ‌ర్థించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ‌లో 2013 భూ సేకరణ చట్టం ప్ర‌కార‌మే భూసేక‌రణ చేయాల‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News