: చెట్ల కింద వైద్యం... రాజస్థాన్ లో చోద్యం

మనం అభివృద్ధికి ఎంత దూరంలో ఉన్నామో కళ్లకు కట్టే సంఘటన ఇది. రాజస్థాన్ లోని దోల్ పూర్ జిల్లా సైప కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం వద్ద తాజాగా మీడియాకు చిక్కిన దృశ్యాలను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చెట్ల కింద వరుసగా రోగులు. చెట్లకు సెలైన్ బాటిళ్లను తగిలించి, వాటిని రోగులకు ఎక్కిస్తున్న తీరు కనిపిస్తుంది. కారణాలను పరిశీలిస్తే... ఇక్కడి కమ్యూనిటీ ఆస్పత్రిలో కేవలం 15 పడకలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడి చుట్టు పక్కల ప్రాంతాల్లో డెంగీ, చికున్ గున్యా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. దీంతో మరో ప్రత్యామ్నాయం కనిపించక అక్కడి సిబ్బంది రోగులకు చెట్ల కిందే వైద్యం చేస్తున్నారు. పగలంటే వెలుతురు ఉంటుంది. కానీ రాత్రయితే వారి పరిస్థితి ఏంటి..? పెరిగిపోయే దోమలతో, చల్లటి వాతావరణంతో చెట్ల కింద ఉన్న రోగుల పరిస్థితి మరింత దుర్భరమే.

More Telugu News