: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరుణుడు

తెలుగు రాష్ట్రాలను వరుణుడు కరుణించాడు. సకాలంలో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినా వ్యవసాయానికి సరిపడా వర్షపాతం నిన్నటి వరకు నమోదవని సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల వేసిన నాట్లు ఎండిపోతున్నాయి. దీంతో రాయలసీమ వంటి చోట్ల రెయిన్ గన్ లను వినియోగిస్తూ పంటలను కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో వర్షాలు కురియడంతో రైతులు ఆనందంగా వున్నారు. హైదరాబాదును గత రాత్రి నుంచే తడిపి ముద్ద చేస్తున్న వరుణుడు, ఇంకా చిరు జల్లులతో నగరాన్ని తడుపుతూనే ఉన్నాడు. పల్నాడులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గుంటూరు, మాచర్ల, ఒంగోలు వంటి ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వర్షాలతో నీటమునిగిన పంటలకు కొంతమేర నష్టం వాటిల్లినా, మరోపక్క ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

More Telugu News