: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఫీజుల ఖరారు... వివరాలు!

తెలంగాణలోని 2016-2017 విద్యా సంవత్సరానికి మెడికల్ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు సీట్ల శాతంతో పాటు ఖరారు చేసిన ఫీజుల వివరాలను వెల్లడించింది. మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 60 శాతం సీట్లను 'ఏ' కేటగిరీకి కేటాయించింది. 25 శాతం సీట్లను 'బీ' కేటగిరీగా పేర్కొంది. మిగిలిన 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో 'సీ'కేటగిరీ కింద వదిలేసింది. అదే సమయంలో నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను మాత్రమే 'ఏ' కేటగిరీకి కేటాయించగా, 35 శాతం 'బీ' కేటగిరీకి కేటాయించింది. 'సీ' కేటగిరీ కింద 15 శాతం ఎన్ఆర్ఐలకు కేటాయించింది. మైనారిటీ కళాశాలల్లోని 'ఏ'కేటగిరీ సీట్లకు కేవలం 60 వేల రూపాయలు వసూలు చేయనుండగా, బీ కేటగిరీ సీట్లకు 14 లక్షల రూపాయలు, ఎన్ఆర్ఐ 'సీ'కేటగిరీకి 28 లక్షల రూపాయల ఫీజులు ఖరారు చేసింది. ఇక అన్ ఎయిడెడ్ నాన్ మైనార్టీ మెడికల్ కాలేజీల్లో 'ఏ' కేటగిరీ సీట్లకు 60 వేల రూపాయల ఫీజు, 'బీ'కేటగిరీ సీట్లకు 11 లక్షల రూపాయలు, 'సీ'కేటగిరీలోని ఎన్ఆర్ఐ సీట్లకు 22 లక్షల రూపాయలు వసూలు చేయనున్నారు. అలాగే డెంటల్ కళాశాలల్లో 'ఏ'కేటగిరీ సీట్లకు ఫీజుగా కేవలం 45 వేల రూపాయలు వసూలు చేయనుండగా, 'బీ'కేటగిరీ సీట్లకు 2.70 లక్షల రూపాయలు, 'సీ'కేటగిరీ సీట్లకు 7 లక్షల రూపాయలు వసూలు చేయనున్నారు. నాన్ మైనార్టీ డెంటల్ కాలేజీల్లో 'ఏ'కేటగిరీ సీట్లకు 45 వేల రూపాయలు, 'బీ'కేటగిరీ సీట్లకు 4 లక్షల రూపాయలు, 'సీ'కేటగిరీలోని ఎన్ఆర్ఐ కోటాకు 5 లక్షల రూపాయలు వసూలు చేయనున్నారు.

More Telugu News