: ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు తేదీ పొడిగిస్తూ ఉత్తర్వులు

ఆడిట్ చేయాల్సిన వ్యాపారస్తుల ఇన్ కం టాక్స్ రిటర్నుల దాఖలుకు గడువు తేదీని పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30గా ఉన్న ఆఖరు తేదీని అక్టోబర్ 17కు పెంచుతున్నామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. పలు వర్గాలు, వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. 2015-16 సంవత్సరంలో రూ. కోటి రూపాయల వ్యాపార ఆదాయం దాటి పన్ను చెల్లించిన వారు, వ్యక్తిగత ఆదాయం రూ. 25 లక్షలు దాటిన వారు ఈ రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇదిలావుండగా, గడచిన ఏప్రిల్ - ఆగస్టు మధ్య కాలంలో నికర పరోక్ష పన్ను వసూళ్లు పెరిగాయని సీబీడీటీ తెలిపింది. పన్ను వసూళ్లు గత సంవత్సరంతో పోలిస్తే 15 శాతం పెరిగి రూ. 1.89 లక్షల కోట్లకు చేరుకున్నాయని, కేంద్ర ఎక్సైజ్, సేవా పన్ను, కస్టమ్స్ సుంకాలు కలిపిన ఇన్ డైరెక్ట్ టాక్స్ వసూలు 27.5 శాతం పెరిగి 3.36 లక్షల కోట్లకు చేరాయని పేర్కొంది.

More Telugu News