: తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్షసూచ‌న

ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ అల్ప‌పీడ‌నం ఉత్త‌ర కోస్తాంధ్ర‌, ద‌క్షిణ ఒడిశా ప్రాంతాల‌ను ఆనుకొని కొన‌సాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, ప‌లు చోట్ల ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్ర‌లోనూ నేటి నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. రాయ‌ల‌సీమ‌లోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు జల్లులు, మ‌రికొన్ని చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొంది. లోత‌ట్టు ప్రాంతాల ప్రజ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

More Telugu News