: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. అతి కష్టం మీద మళ్లీ సముద్రంలోకి వదిలిన వైనం!

47 అడుగుల పొడవు, 20 టన్నుల బరువున్న భారీ వేల్ (తిమింగలం)ను అధికారులు, సామాజిక కార్యకర్తలు, మత్స్యకారులు కలసి విజయవంతంగా సముద్రంలోకి వదిలారు. మహారాష్ట్ర, రత్నగిరి జిల్లాలోని మద్బన్‌ గ్రామ సమీపంలోని తీరానికి భారీ తిమింగలం కొట్టుకువచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్షీరదమైన తిమింగలం తీరంలో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన అధికారులు రెండు బోట్లలో 50 మంది మత్స్యకారులు, అధికారులు, సామాజిక కార్యకర్తలతో కలిసి దానిని తాళ్లతో బంధించి, సముద్రంలో విడిచి పెట్టారు. పోటు అధికంగా ఉండడంతో ఉదయం పది గంటలకు ఈ ఆపరేషన్ ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నానికి దానిని విజయవంతంగా సముద్రంలోకి తీసుకెళ్లగలిగారు.

More Telugu News