: "ఒరేయ్ రామకృష్ణారెడ్డి..." అంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్లకు వచ్చిన బెదిరింపు లేఖ పూర్తి పాఠం!

తనను బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖ పంపారంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ లేఖ ప్రతిని కొద్దిసేపటి క్రితం ఆళ్ల మీడియాకు విడుదల చేశారు. దీనిలో... "ఒరేయ్ రామకృష్ణారెడ్డి ఏమిటి? ఒళ్లు ఎలా వుంది? మా ముఖ్యమంత్రి మీద కోర్టులో కేసు వేశావు. దాని మీద హైకోర్టులో స్టే తెచ్చుకుంటే నువ్వు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాలి అనుకుంటున్నావని తెలిసింది. నా... నీకు ఇవే చివరి రోజులు. నిన్ను నీ నియోజకవర్గంలోనే చంపుతా చూస్తూ ఉండు నా... నిన్ను మంగళగిరిలోనే చంపుతాము. మేమంటే ఏమిటో నీకు త్వరలోనే తెలుస్తుంది. చూస్తూ వుండు నా... నీకు రోజులు దగ్గర పడి మా నాయకుడి మీద కేసు వేశావు. నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. ఇంక నిన్ను బ్రతకనివ్వం చూస్తూవుండు నా... ఖబడ్దార్" అని ఉంది. ఎమ్మెల్యే ఆళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News