: హైదరాబాద్ పై ఏ క్షణమైనా ఉగ్రదాడి: కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరిక

హైదరాబాద్ నగరంపై ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగవచ్చని, పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ విభాగాన్ని హెచ్చరిస్తూ, కేంద్రం నుంచి సమాచారం అందింది. బక్రీద్, గణేశ్ నిమజ్జనాలే లక్ష్యంగా ముష్కరులు తెగబడవచ్చని హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో భారీ కవాతు నిర్వహించారు. ఆపై పలు ప్రాంతాల్లో నాకాబందీ ప్రారంభించి, సోదాలు ముమ్మరం చేశారు. బక్రీద్, నిమజ్జనాలకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే పలువురు రౌడీషీటర్లను అరెస్ట్ చేయడం జరిగిందని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీ నుంచి సాధ్యమైనంత త్వరగా వినాయక విగ్రహాల ఊరేగింపు ముగిసేలా ప్రణాళిక రూపొందించినట్టు వివరించారు.

More Telugu News