: సాహబుద్దీన్ కాన్వాయ్ లో వంద కార్లు!... ట్యాక్స్ కట్టకుండానే టోల్ గేటు దాటేసిన వైనం!

బీహార్ అధికార కూటమిలోని ఆర్జేడీకి చెందిన కీలక నేత, హత్య కేసులో 13 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన మహ్మద్ సాహబుద్దీన్ మొన్న విడుదలయ్యారు. నేరమయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఆయనకు విడుదల సందర్భంగా ఘన స్వాగతం లభించింది. దాదాపు వందకు పైగా కార్లలో తరలివచ్చిన ఆయన అనుచరులు భారీ కాన్వాయ్ తో ఆయనను జైలు నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సాహబుద్దీన్ కాన్వాయ్ లోని ఏ ఒక్క వాహనం కూడా టోల్ ట్యాక్స్ కట్టకుండానే వెళ్లిపోయాయి. ట్యాక్స్ అడిగేందుకు అసలు టోల్ గేటు సిబ్బంది నోరు కూడా తెరవలేదట. పోలీసు శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సాహబుద్దీన్ కాన్వాయ్ నుంచి ట్యాక్స్ వసూలు చేయలేదని టోల్ గేటు సిబ్బంది చెబుతున్నారు. ఇక సాహబుద్దీన్ కాన్వాయ్ లో రెడ్ లైట్లు ఉన్న వాహనాలతో పాటు ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీలకు చెందిన జెండాలతో ఉన్న కార్లు కూడా ఉన్నాయి.

More Telugu News