: రూ. 1200 కోట్ల కోసం ఐపీఓకు రానున్న ఆసియాలో అత్యంత పురాతన ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ

ఆసియాలోనే అత్యంత పురాతన స్టాక్‌ ఎక్స్ఛేంజ్ గా పేరు తెచ్చుకున్న బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ. 1200 కోట్ల నుంచి రూ. 1300 కోట్ల మేర నిధులను సమీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ముసాయిదా పత్రాలను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న షేర్‌ హోల్డర్లే బీఎస్‌ఈ ఐపీఓ ద్వారా నిధులను రాబట్టే పనిలోపడ్డారు. ఈ ఆఫర్‌ ఫల్‌ సేల్‌ ద్వారా సుమారు మూడు కోట్ల షేర్లను విక్రయించనున్నట్టు తెలుస్తోంది. బీఎస్ఈలో మొత్తం 9,855 షేర్ హోల్డర్లుండగా, వారిలో 8,559 మంది పబ్లిక్ షేర్ హోల్డర్లు. వీరి వద్ద 55 శాతం వాటాలున్నాయి. మిగతా 1,296 మంది ట్రేడింగ్ సభ్యులు, వారి అసోసియేట్స్, ఇప్పటివరకూ మొత్తం 262 మంది వాటాదారులు తమ వాటాలను అమ్మకానికి ఉంచినట్టు తెలుస్తోంది. బీఎస్ఈలో టాప్ 8 వాటాదారులుగా ఉన్న ఎస్జీఎక్స్ సహా వివిధ ఇనిస్టిట్యూషన్స్ 2.99 కోట్ల వాటాలను ఐపీఓలో భాగంగా అమ్మదలిచాయి. ఇక వాటాలను విక్రయించే వారిలో ఈనామ్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు నిమీష్ ఎస్ షా, షేర్ ఖాన్, దమానీ ఫైనాన్స్ కు చెందిన రమేష్, సెంట్రమ్ బ్రోకింగ్, ఎంకే గ్లోబల్, ఐడీబీఐ కాపిటల్స్, జేఎం ఫైనాన్షియల్ తదితర సంస్థలు, ప్రముఖులు ఉన్నారు. ఒక్కో వాటా ధర రూ. 400 నుంచి రూ. 650 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.

More Telugu News