: కొత్తగా జియో సిమ్ కార్డులిచ్చి తలనొప్పి తేవద్దు: ఆదేశాలిచ్చిన రిలయన్స్

"రిలయన్స్ జియో నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఏ సిమ్ నూ యాక్టివేట్ చేయవద్దు. రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ చెప్పేవరకూ కస్టమర్లు ఎవరికీ సిమ్ కార్డులు ఇవ్వద్దు. మీరు సిమ్ కార్డులు ఇస్తే కంపెనీకి తలనొప్పి వచ్చి ఇప్పుడున్న మంచి పేరు పోతుంది. మహారాష్ట్రలో 50 వేల సిమ్ కార్డులను యాక్టివేట్ చేయాల్సి వుంది. వాటన్నింటి యాక్టివేషన్ పూర్తయిన తరువాతే కొత్త సిమ్ లను ఇవ్వండి" అని రిలయన్స్ జియో నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, కంపెనీ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందింది. రిలయన్స్ జియో సిమ్ కార్డుల కొరత దేశవ్యాప్తంగా ఉండగా, సిమ్ లను పొందిన వారు యాక్టివేషన్ జరగక వేచి చూస్తున్న పరిస్థితుల్లో ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. మూడు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్, కాల్స్ అందుకోవచ్చని ఆశగా రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ మినీ, థర్డ్ పార్టీ స్టోర్లకు వెళుతున్న కస్టమర్లు ఉత్త చేతులతో వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లక్షలాదిగా వస్తున్న కస్టమర్లకు సిమ్ కార్డులను అందించడంలో విఫలమవుతున్నామని, ఇచ్చిన కార్డుల యాక్టివేషన్ తరువాత, కొత్తవి ఇస్తామని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News