: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం ఉత్తర కోస్తా, తెలంగాణపై అధికంగా ఉంటుందని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, తెలంగాణలోని అత్యధిక ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి ముసురు పట్టగా, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. అటు ఎపీలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షపాతం నమోదైంది.

More Telugu News