: విదేశాల్లోని భారత విద్యార్థులకు సుష్మా హెచ్చరిక.. ఫేక్ కాల్స్‌ను నమ్మవద్దని సూచన

ధ్రువపత్రాల్లో తప్పులు ఉన్నాయంటూ వచ్చే తప్పుడు ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని విదేశాల్లోని భారత విద్యార్థులను విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్ హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన మంత్రి ‘‘మీరు సమర్పించిన ధ్రువపత్రాల్లో లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దాల్సి ఉంది. ఇందుకోసం ఖర్చవుతుంది. లేదంటే దేశం విడిచి వెళ్లడం ఖాయం’’ అని బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తాయని, వాటిని ఏమాత్రం నమ్మవద్దని మంత్రి కోరారు. ఇటువంటి కాల్స్‌ను అందుకున్న వారు వెంటనే ఎంబసీకి ఫిర్యాదు చేయాలని కోరారు. ఒకవేళ అటువంటి కాల్స్ అందుకుంటే ఆ నంబరుకు తరచూ ఫోన్ చేస్తూ వారితో టచ్‌లో ఉండాలని కోరారు. అలాగే ఎంబసీకి ఫిర్యాదు చేయడం ద్వారా వారు నిందితులపై చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

More Telugu News