: రిలయన్స్‌పై కక్ష తీర్చుకుంటున్న ఇతర నెట్‌వర్క్ సంస్థలు.. ఎక్కువ మొత్తం చెల్లిస్తేనే కాల్స్ కనెక్ట్ చేస్తామని వెల్లడి

రిలయన్స్‌పై ఇతర నెట్‌వర్క్ కంపెనీలు కక్ష తీర్చుకుంటున్నాయి. జియో దెబ్బకు కకావికలైన సంస్థలు నిన్న టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)తో సమావేశమయ్యాయి. జియో నుంచి వచ్చే ఫ్రీ కాల్స్ సునామీని తట్టుకోవాలంటే అధికమొత్తంలో చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాయి. అలా అయితేనే కాల్స్‌ను కనెక్ట్ చేస్తామని, లేదంటే లేదని తేల్చి చెప్పాయి. ప్రస్తుతం చెల్లిస్తున్న ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్(ఐయూసీ) కంటే ఎక్కువ చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఐయూసీ ప్రకారం ఇప్పుడు ఇతర నెట్‌వర్క్ కాల్స్‌కు నిమిషానికి 14 పైసలు వసూలు చేస్తున్నాయి. పోటీ కంపెనీల వ్యవహారంపై రిలయన్స్ మండిపడుతోంది. ఆయా కంపెనీలు టెలికం లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది.

More Telugu News