: ఉత్తరాది అహంకారంపైనే నా పోరాటం: పవన్ కల్యాణ్

ఉత్తరాది అహంకారంపైనే తన పోరాటమని పవన్ కల్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నో బలిదానాల తర్వాత కానీ, తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేకపోయాం.. క్షమించండి అని ఉత్తరాది నాయకులెవరూ ఇక్కడికి వచ్చి చెప్పలేదు. అదేవిధంగా సీమాంధ్రకు ఉత్తరాది నాయకులు వచ్చి తప్పుచేశాము, పొరపాటు చేశాము, మమ్మల్ని క్షమించండని ఈరోజుకీ వారు చెప్పలేదు. వాళ్లకు అహంకారం.. అంతకంత అహంకారం.. ఉత్తరాది అహంకారం. దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారంపైనే నా పోరాటం. ఏం, మేము భారతీయులం కాదా? మీరొక్కరేనా భారతీయులు? మీ పది మంది కలిస్తేనేనా భారతదేశం? ఇన్ని కోట్ల మంది దక్షిణభారతీయులకు ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు? ఎందుకు?’ అని ప్రశ్నిస్తున్నానంటూ తీవ్ర భావోద్వేగంగా ప్రసంగించారు.

More Telugu News