: 'భారతదేశం నాది' అనుకుని బతికినవాడిని.. ఆఖరికి సీమాంధ్రోడినైపోయాను!: పవన్ కల్యాణ్ ఆవేదన

‘భారతదేశం నాదనుకుని బతికిన వాడిని, ఆఖరికి సీమాంధ్రోడినయిపోయాను నేను. ఆ తర్వాతే తెలుగోడిని’ అంటూ పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ, తెలంగాణ, సీమాంధ్ర నాయకులు కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని అన్నారు. కేవలం సీమాంధ్ర నాయకుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందంటే తాను ఒప్పుకోనన్నారు. తెలంగాణకు చెందిన మర్రి చెన్నారెడ్డి, జానారెడ్డి, ఇలా ప్రతి ఒక్క తెలంగాణ నాయకుడు ఉన్నారన్నారు. తనకు ఏపీలో ఒక్క సెంటు భూమి, ఇల్లు కూడా లేవని, తాను పెరిగింది, ఉంటున్నది హైదరాబాద్ లోనేనని అన్నారు. అయినా కానీ, ఒక తప్పు జరిగినప్పుడు సరైన దృక్పథంలో చూడకపోతే సత్యం బయటకు రాదని, ఈ దేశంలో మన జాతీయ స్లోగన్ ఏమిటంటే ‘సత్యమేవ జయతే’ అని పవన్ అన్నారు. దీని అర్థం సత్యం గెలుస్తుందని కాదు, కేవలం సత్యం మాత్రమే గెలుస్తుందంటూ పవన్ ఉద్విగ్నంగా మాట్లాడారు. అందుకనే, ఒక సమస్య ఎదుర్కొనేటప్పుడు తనకు ఎటువంటి భయం లేదని అన్నారు.

More Telugu News