: కర్ణాటక బంద్ ఎఫెక్ట్... 53 తమిళ ఛానెళ్లు, 3,800 పెట్రోల్ బంకులు బంద్

కావేరీ నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటకలో బంద్ చేపట్టారు. నేటి ఉదయం 6 గంటల నుంచి బంద్ మొదలు కాగా, బెంగళూరు, మాండ్య, మైసూరు వంటి ప్రధాన పట్టణాల్లో విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. మెట్రోలను ఎవరూ ఉపయోగించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 3,800 పెట్రోల్ బంకులు మూసేశారు. కర్ణాటకలో కేబుల్ ద్వారా ప్రసారమయ్యే 53 తమిళ ఛానెళ్లు నిలిచిపోయాయి. బంద్ సందర్భంగా వివిధ పట్టణాల్లో ఆందోళనకారులు రోడ్లపై టైర్లు కాల్చి రాకపోకలు నిలిచిపోయేలా చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకూడదని, హద్దులు మీరితే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించిన సంగతి తెలిసిందే.

More Telugu News