: సినిమాలు మానేయమంటే ఈ క్షణమే మానేస్తాను... మానేయనా?: వేలాది మందికి పవన్ ప్రశ్న

"ఈ మధ్యన ప్రతిఒక్కరూ సినిమాలు అన్నా చెయ్యి, రాజకీయాలు అన్నా చెయ్యి అంటున్నారు. సినిమాలు మానేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలేయమంటారా?" అని తన బహిరంగ సభకు అసంఖ్యాకంగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు. దీనికి 'వద్దూ' అని దిక్కులు పిక్కటిల్లేలా సమాధానం వచ్చింది. "నేను సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి. నాకు తినడానికి కూడా డబ్బుల్లేవు. మీరే ఇవ్వాలి నాకు. మీ ఒక్కొక్కళ్ల ఇంటికి వచ్చి అమ్మా, అక్కా నాకు అన్నం పెట్టు. ఆకలేస్తుంది అని అడుగుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను. రాజకీయాల మీద నాకు అవగాహన ఉంది. నేను కడుపుమంట చూశాను. సమస్యలను చూశాను. బాధలను చూశాను. నా కష్టాలను నేను మరచిపోలేదు. అందుకే నేను రాజకీయాల్లోకి రావాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి అంటే ఏం చేయాలి? ఎలా ముందడుగు వేయాలన్నది తెలుసుకున్నాను. అందరి చరిత్రలూ చదివాను. సామాజిక తత్వం తెలుసుకున్నాను. సామాజిక శాస్త్రం చదివాను. కేవలం చదివితే కాదు, జీవితంలో ఎంతో కొంత పాటించాలన్న ఉద్దేశంతో నాకు తోచినట్టు పాటించాను. ఒక పోరాటం చేయాలంటే సరైన, బలమైన ఆలోచనా విధానం కావాలి. అదిప్పుడు నాకుంది" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

More Telugu News