: రాజకీయాలంటే గడ్డం గీసుకున్నత సులభం కాదంటారు... గడ్డం గీసుకున్నంత సమయంలో రాష్ట్రాన్ని విడగొట్టలేదా?: ప్రశ్నించిన పవన్

కొందరు తనను ఉద్దేశించి, రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత సులభం కాదని అంటున్నారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, గడ్డం గీసుకోవడానికి పట్టేంత సమయంలోనే రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టలేదా? అంటూ ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ గడ్డం గీసుకున్న తరువాత మిగిలిపోయిన బ్లేడు ముక్కలు పడేసినట్టుగా ప్యాకేజీని పడేసిందని విమర్శించారు. తాను అవకాశవాద రాజకీయాలు చేసేందుకు రాలేదని, సైద్ధాంతిక బలంతో వచ్చానని, ప్రజా సమస్యలను చదివి వచ్చానని అన్నాడు. "నేను సినిమాలు చేయొచ్చుగాక. సినిమా హీరోని కావచ్చుగాక. కానీ మీలాగా నేను వేలకు వేలు ఎకరాలుగానీ, వేలకు వేల కోట్ల డబ్బులుగానీ సంపాదించుకోలేదు. నాకు అవసరం లేదు. మా తాత గొప్ప రాజకీయనాయకుడు కాదు. కోటీశ్వరుడు కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసిన ఓ సామాన్య పోస్ట్ మ్యాన్ మాత్రమే. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఓ పోలీస్ కానిస్టేబుల్. ఇదీ మా జీవిత చరిత్ర. మాకు 'మా తాతలు నేతులు తాగారు. మా మూతుల వాసన చూడండి' అనే చరిత్ర లేదు. మావాళ్లు చాలా చాలా సామాన్యులు. మామూలు వ్యక్తులు. అందుకే నాకూ అందరిలాగా బతకడం ఇష్టం" అన్నాడు. పవన్ ప్రసంగం సాగుతోంది.

More Telugu News