: గడ్డకట్టించే చలిలో కేబుల్ కార్లలో ఇరుక్కుపోయిన 30 మంది... హెలికాప్టర్ల సాయంతో ఆహారం అందించిన ఫ్రాన్స్

ఫ్రాన్స్ లోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని బ్లాంక్ పర్వతం అందాలను చూసేందుకు వెళ్లిన వారు గడ్డకట్టించే చలిలో నిద్రలేని రాత్రి గడపాల్సి వచ్చింది. కేబుల్ కార్లలో బయలుదేరిన వీరు సాంకేతిక కారణాలతో మంచుకొండల మధ్య గురువారం సాయంత్రం 5:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు) చిక్కుకుపోగా, వీరిని కాపాడేందుకు భారీ ఎత్తున భద్రతా దళాలను ఫ్రాన్స్ రంగంలోకి దింపాల్సి వచ్చింది. మొత్తం 5 కిలోమీటర్ల పొడవైన ఈ కేబుల్ మార్గంలో మొత్తం 110 మంది చిక్కుకు పోగా, దాదాపు 9,840 అడుగుల ఎత్తున మూడు కార్లలో 32 మంది చిక్కుకున్నారు. వీరు రాత్రంతా వాటిల్లోనే ఉండగా, ఆహారం అందించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. వారికి బ్లాంకెట్లను, వాటర్ బాటిళ్లను, బిస్కెట్లను అందించారు. మిగతా కేబుల్ కార్లలోని వారిని గంటల వ్యవధిలో సురక్షితంగా రక్షించారు. ఈ 32 మందిని మాత్రం సురక్షితంగా బయటకు తెచ్చే మార్గం లేకపోయింది. ఆపై తెల్లారిన తరువాతనే సమస్య పరిష్కారం కాగా, వీరంతా బతుకు జీవుడా అని బయటపడ్డారు.

More Telugu News