: గుడ్డోడు గూట్లో రాయేసినట్టు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్: సీపీఐ నారాయణ నిప్పులు

సినీ హీరో, జనసేన నేత పవన్ కల్యాణ్, ప్రత్యేక హోదాపై గుడ్డోడు గూట్లో రాయేసినట్టు మాట్లాడుతున్నారే తప్ప, హోదా సాధించాలన్న అంకితభావంతో ఉన్నట్టు కనిపించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ఢిల్లీలో వెంకయ్యనాయుడు, విజయవాడలో చంద్రబాబు హైడ్రామాలను నడిపించారని విమర్శించారు. తక్షణం కేంద్రం నుంచి బయటకు వచ్చి హోదా సాధనకు టీడీపీ ఉద్యమించాలని అన్నారు. రాష్ట్ర ప్రజలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని నారాయణతోనే కలసి మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News