: టీసీఎస్ ప్రతికూల ప్రకటనతో ఐటీ షేర్ల ఫాలింగ్

స్టాక్ మార్కెట్లలో గురువారం ఐటీ షేర్లు నష్టాలను చవి చూస్తున్నాయి. ఐటీ సేవల అగ్రగామి కంపెనీ టీసీఎస్ చేసిన ప్రకటనే ఇందుకు కారణం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల నుంచి ఆర్డర్ల పరంగా ప్రతికూలతలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని టీసీఎస్ ప్రకటన చేసింది. దీంతో టీసీఎస్ షేర్ స్టాక్ మార్కెట్లలో భారీగా పడిపోయింది. మధ్యాహ్నం 1.16 గంటల సమయానికి బీఎస్ఈలో టీసీఎస్ స్టాక్ 5.69 శాతం నష్టంతో 2,307.65 వద్ద ట్రేడవుతోంది. విప్రో 2 శాతం నష్టంతో 472.80 వద్ద, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ షేర్లు సైతం 2 శాతం నష్టంతో వరుసగా 1035, 770 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో విప్రో 52 వారాల కనిష్ఠ స్థాయుల వద్ద ఉంది.

More Telugu News